వంశీ పైడిపల్లికి నో చెప్పిన యంగ్ హీరో!
Kartik Aaryan Say No to A Salman
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఓ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వంశీ పైడిపల్లి బాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెడుతుండటంతో ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కీలకమైన ప్రత్యేక అతిథి పాత్ర కోసం చిత్ర యూనిట్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్‌ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో తనదైన శైలిలో కనిపించాల్సిందిగా మేకర్స్ ఆయన్ని కోరినట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం తన చేతిలో ఉన్న వరుస ప్రాజెక్ట్‌లు .. బిజీ షెడ్యూల్ కారణంగా కార్తీక్ ఆర్యన్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆ పాత్ర కోసం వంశీ తదుపరి ఏ నటుడిని అప్రోచ్ అవుతారు? అన్నది తెలియాల్సి ఉంది.







































