ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishwambhara Release date Announcement On

విశ్వంభ‌ర రిలీజ్ తేదీ ఆ రోజు చెప్పేస్తారా?

Vishwambhara Release date Announcement On

 

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న‌ మోస్ట్ అవేటెడ్ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం `విశ్వంభర` కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. `బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ వీఎఫ్‌ఎక్స్ ..భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ  చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఈ సినిమా విడుదలకు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ పనులు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో రిలీజ్  తేదీపై త్వరలోనే స్పష్టత రానుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఈ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనే దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆ ప్రత్యేకమైన రోజున విశ్వంభర రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు మెగా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. బర్త్ డే కానుకగా విడుదలయ్యే అప్‌డేట్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేయడం ఖాయం.

Vishwambhara Release date