స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన యంగ్ సెన్సేషన్!
Sreeleela makes stylish Wimbledon debutతెలుగు అందం శ్రీలీల ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్‌లో సందడి చేశారు. లండన్‌లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లను వీక్షించారు. ఈ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లో పాల్గొన్న అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో శ్రీలీల ఒకరిగా నిలిచారు. ఈ పర్యటనలో శ్రీలీల తల్లి కూడా ఉన్నారు. ఈవెంట్ కోసం శ్రీలీల ఎంపిక చేసుకున్న డిజైనర్ దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి.
నేవీ బ్లూ పిన్‌స్ట్రైప్ ప్యాంట్‌సూట్ ఓవర్సైజ్డ్ డబుల్ బ్రెస్ట్డ్ బ్లేజర్‌ను ధరించి ఎంతో హుందాగా కనిపించారు. తన క్లాసిక్ .. సమకాలీన ఫ్యాషన్ అభిరుచికి అద్దం పడుతూ న్యూడ్ పాయింటెడ్-టో హీల్స్ .. స్ట్రక్చర్డ్ వైట్ హ్యాండ్‌బ్యాగ్‌తో రూపాన్ని పూర్తి గా మార్చేసారు. ఈ స్టైలిష్ లుక్ వింబుల్డన్ గ్లోబల్ ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది. అక్కడికి వచ్చిన అందాలన్నీ ఒక ఎత్తైతే? శ్రీలీల అందర్నీ డామినేట్ చేసి అలరించింది.
శ్రీలీల హాజరు పట్ల సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఆన్‌స్క్రీన్ పాత్రల నుండి బయటపడి ఫ్యాషన్ ప్రపంచంలో మెచ్యూర్డ్ .. గ్లోబల్ ఐకాన్‌గా ఎదుగుతున్నారని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. వింబుల్డన్ అధికారిక సోషల్ మీడియా వేదికలు కూడా శ్రీలీల ఫోటోలను పంచుకున్నాయి. క్రీడలు ..వినోద రంగాల కలయికతో ఈ ఏడాది వింబుల్డన్ మరింత సందడిగా మారింది.







































