ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akhil Akkineni Lenin Targets 50 Cr Box Office

లెనిన్ టార్గెట్ ఫిక్స్

Akhil Akkineni Lenin Targets 50 Cr Box Office

 

అఖిల్ లెనిన్ మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. లెనిన్ మేకర్స్ లెనిన్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి అస్సలు సిద్ధంగా లేరు. అందుకే లెనిన్ ప్రీమియర్స్ విషయంలో వారు చాలా తెలివిగా ఆలోచించారు. రేపు ఉదయం 4.30 ఆట నుంచే లెనిన్ హడావిడి మొదలు కాబోతుంది.

ప్రస్తుతము లెనిన్ పై మంచి అంచనాలున్నాయి. అభిమానుల్లోనూ లెనిన్ పై విపరీతమైన హైప్ ఉంది. మురళి కిషోర్ అబ్భురి దర్శకత్వంలో అఖిల్-భాగ్యశ్రీ బోర్సే జంటగా రాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. లెనిన్ థియేట్రికల్ గా అన్ని ఏరియాలకు కలిపి రూ.25 కోట్లకి పైగా టార్గెట్ తో బాక్సాఫీస్ దగ్గర దిగుతున్నట్టు తెలుస్తుంది.

అంటే ఈ సినిమా రూ 45 కోట్ల నుంచి రూ.50 కోట్ల గ్రాస్ ని రాబడితే సేవ్ అయిపోతుంది. మరోపక్క నాన్ థియేట్రికల్ హక్కులు ఉండనే ఉన్నాయి. డిజిటల్, ఆడియో, శాటిలైట్ హక్కుల కింద కూడా భారీగానే వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి అఖిల్ లెనిన్ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. 

Akhil Akkineni's Lenin Aims for ₹50 Cr Box Office Target