టీవీ నటి అనే ముద్రపై నాగిని ఆగ్రహం!
Mouni Roy Opens Up On Her Journey From TV To Filmsసాధారణంగా టీవీ రంగానికి చెందిన నటీనటులు వెండితెరపైకి అడుగుపెట్టినప్పుడు వారిపై ప్రత్యేక ముద్రలు వేయడం సినీ పరిశ్రమలో కనిపిస్తుంది. తాజాగా మౌనీ రాయ్ ఓ ఇంటర్వ్యూలోనటీనటులను టీవీ ఆర్టిస్ట్ లేదా బాలీవుడ్ స్టార్ అంటూ విభిన్న కేటగిరీలుగా విభజించి ముద్రలు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నటుడికి లేదా నటికి ప్రతిభే ప్రాధాన్యత కాపలా కాబట్టి ఏ మాధ్యమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారనేది ముఖ్యం కాదంటోంది.
బుల్లితెర నుండి బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో స్థిరపడటానికి తనకు దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘమైన కఠినమైన పోరాటం చేసానని మౌనీ రాయ్ గుర్తుచేసుకున్నారు. బయటి వ్యక్తులకు గ్లామర్ ప్రపంచం ఎంతో రంగులమయంగా కనిపించినా? ఒక రంగం నుండి మరో రంగానికి మారి అక్కడ తనను తాను నిరూపించుకోవడం అంత సులువు కాలేదని ఎమోషనల్ అయ్యారు. అక్షయ్ కుమార్ సరసన `గోల్డ్` సినిమాతో హిందీ వెండితెరకు పరిచయమై ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రల్లో నటించినా? ఒక నటిగా తనకు రావాల్సిన పూర్తి స్థాయి గుర్తింపు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నానని పేర్కొన్నారు.
కెరీర్లో ఇన్ని విజయాలు అందుకున్నా? ఇప్పటికీ మంచి పాత్రలు చేయడానికి ఆకలితో ఉన్నానని, వినూత్నమైన కథల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో - సినీ వర్గాల్లో ఒక కొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ఓటీటీలు, డిజిటల్ ప్లాట్ఫార్మ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా నటీనటుల మధ్య ఇలాంటి వివక్ష రేఖలు ఉండటం దురదృష్టకరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.







































