ధురంధర్ హీరోపై బ్యాన్
Ranveer Singh banned by FWICE over Don 3 exit
ధురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలతో సెన్సేషనల్ హీరోగా మారిన రణ్వీర్ సింగ్ పై బాలీవుడ్ బ్యాన్ విధించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆదిత్య ధర్ డైరెక్షన్ లో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ రెండు భాగాలూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు రణ్వీర్ సింగ్ పై బాలీవుడ్ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్( FWICE) బ్యాన్ విధించడం చర్చనీయాంశం అయ్యింది.
కారణమేమిటి అంటే రణ్వీర్ సింగ్ ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో డాన్ 3 లో నటించాల్సి ఉంది. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తయ్యాక రణవీర్ సింగ్ స్క్రిప్ట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ చిత్రం నుంచి లాస్ట్ మినిట్ లో తప్పుకోవడంతో తమకు 40 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా నిర్మాణ సంస్థ, ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారు. ఆతర్వాత రణ్వీర్ సింగ్ ఓ పది కోట్లు వెనక్కి ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు ఏకంగా FWICE రణ్వీర్ సింగ్ పై బ్యాన్ విధిస్తూ చర్యలు తీసుకుంది. దీని ప్రకారం రణ్వీర్ సింగ్ ని ఏ చిత్రంలోకి కన్సిడర్ చెయ్యడానికి వీల్లేదు అని FWICE ప్రకటించింది. మరి ఈ వివాదం పై రణ్వీర్ స్పందన ఏమిటి అనేది అందరూ వేచి చూస్తున్నారు.







































