జాన్వీ ముందు తేలిపోయిన శృతి
Peddi Special Song: Janhvi Kapoor vs Shruti Haasan
పెద్ది మ్యూజిక్ ఆల్బమ్ లోని మూడు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. చికిరి చికిరి సాంగ్ అలాగే రయ్ రయ్ రా.. రా సాంగ్ ఇప్పుడు హల్లో అంటూ ఐటెం సాంగ్ ఈ మూడు పాటలు మ్యూజిక్ లవర్స్ ని ఊపేస్తున్నాయి. పెద్ది స్పెషల్ సాంగ్ కోసం ఎంతోమంది హీరోయిన్స్ పేరు వినిపించినా చివరకు బుచ్చిబాబు కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ ని తీసుకొచ్చారు.
ఈ పాటలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, జాన్వీ కపూర్ లు కాలు కదపడం కాదు గ్లామర్ తో రెచ్చిపోయారు. అయితే ఈ పాటలో డాన్స్ పరంగా శృతి హాసన్, జాన్వీ కపూర్ ఇద్దరూ చరణ్ తో పోటీ పడినా గ్లామర్ పరంగా శృతి హాసన్ కన్నా జాన్వీ కపూర్ ఒక స్టెప్ ఎక్కువ ఉంది అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.
గ్లామర్ పరంగా జాన్వీ కపూర్ శృతి హాసన్ ని డామినేట్ చేసింది.. చరణ్ పక్కన జాన్వీ కపూర్ హైలెట్ అయ్యింది, ఈ విషయంలో ఒకింత శృతి హాసన్ డల్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించినా.. ఈపాట కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో ఈ కామెంట్స్ ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.







































