Loading...

NBK 111 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Interesting update on NBK 111


నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న NBK 111 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. జూన్ 10 బాలయ్య బర్త్ డే కి దర్శకుడు గోపీచంద్ మలినేని NBK 111 టైటిల్ గ్లింప్స్ రివీల్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. కాజల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే తాజాగా NBK 111 ప్రాజెక్ట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. NBK 111 ప్రాజెక్ట్ లోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో బాలయ్య అలాగే మిగిలిన కీలక పాత్రల పై భారీ యాక్షన్ విజువల్స్ ను గోపీచంద్ మలినేని చిత్రీకరిస్తారట.  

అయితే ఈ సీక్వెన్స్ లో బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ప్లాన్ లో దర్శకుడు ఉన్నారు. మరోపక్క బాలయ్య, కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య చెయ్యబోయే NBK 112 ప్రాజెక్ట్ దసరా నుంచి స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.

NBK 111