Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Naga Chaitanya - Sobhita Dhulipala latest clicks

సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో చై-శో!

Naga Chaitanya - Sobhita Dhulipala latest clicks

నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల జంట మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా  హైదరాబాద్ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కారు. ఈ సందర్భంగా వారు ధరించిన దుస్తులు ,వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడా హడావుడి లేకుండా అత్యంత సాధారణమైన దుస్తుల్లో (ఎలిగెంట్ లుక్) కనిపిస్తూనే తమదైన శైలిలో అందరి దృష్టిని ఆకర్షించింది. గత కొంతకాలంగా ఇద్ద‌రి  బంధం గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా కలిసి కనిపించడం అభిమానులకు పండగలా మారింది.

విమానాశ్రయంలో చైతన్య- శోభిత ఒకరితో ఒకరు ఎంతో సౌకర్యవంతంగా సంభాషించుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. వారి మధ్య ఉన్న ఆ సున్నితమైన అనుబంధం చూస్తుంటే ఈ జంట మధ్య ప్రేమానురాగాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థమవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీ హోదా ఉన్నా? మీడియా పట్ల ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ముందుకు సాగడం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఫొటోలు ,  వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ఇక కెరీర్ ప‌రంగా ఇద్ద‌రు కూడా బిజీగానే ఉన్నారు. నాగ‌చైత‌న్య క‌మిట్ అయిన ప్రాజెక్ట్ లు పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. శోభిత మాత్రం వివాహం త‌ర్వాత సినిమాలు త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. బాగా న‌చ్చిన క‌థ‌ల‌కు మాత్ర‌మే క‌మిట్అవుతున్నారు. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటున్నారు. విహానికి ముందు త‌ర‌హా స్పీడ్ ను శోభిత ఇప్పుడు చూపించ‌డం లేదు.

Naga Chaitanya - Sobhita Dhulipala