ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kiara Advani opens up about silent career struggles

అవన్నీ భరించా - కియారా

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం డిమాండ్ ఉన్న హీరోయిన్. కబీర్ సింగ్, ధోని చిత్రాలతో పాపులర్ అయిన ఈ బ్యూటీ కి సౌత్ లో సక్సెస్ దక్కలేదు, ఇప్పుడు యష్ టాక్సిక్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న కియారా అద్వానీ కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న సమస్యలపై రియాక్ట్ అయ్యింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎదుర్కునే ఇబ్బందులే కియారా ఎదుర్కొంది.

నా కెరీర్ స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ అయ్యాను. ప్రతి సమస్య నుంచి పాఠం నేర్చుకున్నాను. అదే నన్ను ఈ స్థాయిలో నిలబడేందుకు సహాయపడింది. నా మొదటి చిత్రాలు ధోని, ఇంకా కబీర్ సింగ్ కాదు. కానీ అవే నన్ను పాపులర్ చేసాయి. నా మొదటి చిత్రం ఆడకపోవడంతో నా కేరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది.

మళ్లీ ఆడిషన్స్ ఇవ్వడం, కొందరు ఓకే అనడం.. కొంతమంది తిరస్కరించడం.. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఇలాంటి ఇబ్బందులు సినిమా పరిశ్రమలో ఏ నటికైనా అవి తప్పవు. వాటిని భరించాను కాబట్టే.. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ కియారా చెప్పుకొచ్చింది. 

Kiara Advani recalls struggling to book roles even after success of MS DhoniKiara Advani opens up about silent career struggles