డబ్బు పిచ్చోళ్లు చూసే వెబ్ సిరీస్ ఇదే

The revolution NEVER ends SeriesThe revolution NEVER ends Series

డబ్బు కోసం ఎంతకైనా తెగించే మనుషులు.. వారి తెలివైన ఎత్తుగడలతో సాగే దోపిడీల నేపథ్యంలో `మనీ హీస్ట్` వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 2022లో ఐదు సీజన్లతో ఈ ప్రయాణం క్లోజ్ అయింద‌ని భావించిన అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే టీజ‌ర్ తో అప్‌డేట్ ఇచ్చింది. `రెవల్యూషన్ నెవర్ ఎండ్స్` అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేసిన తాజా అనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పుడు నెట్టింట ధన దాహం తీర్చుకునే సరికొత్త కథలకు నాంది పలుకుతోంది. `మనీ హీస్ట్ సీజన్ 6` రాబోతుందా లేదా అన్న ఉత్కంఠను రేకెత్తిస్తూనే ఈ గ్లోబల్ హిట్ సిరీస్ విశ్వం మరిన్ని స్పిన్-ఆఫ్‌లతో మరింత విస్తరించబోతోందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది.

ప్రస్తుతానికి అభిమానులందరి కళ్లు `బెర్లిన్` సిరీస్ రెండో సీజన్‌పై ఉన్నాయి. ఫ్యాన్ ఫేవరెట్ క్యారెక్టర్ ఆండ్రెస్ డి ఫోనోల్లోసా (బెర్లిన్) ప్రధాన పాత్రలో సాగే ఈ స్పిన్-ఆఫ్ సిరీస్ 2026 మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ నుండి టన్నుల కొద్దీ బంగారాన్ని కొల్లగొట్టిన ఆ అద్భుతమైన దోపిడీ ప్రయాణం తర్వాత ఈ యూనివర్స్ సరికొత్త మలుపులతో మనల్ని ఆశ్చర్యపరచబోతోంది. శతాబ్దపు అత్యంత కళాత్మక దోపిడీల వెనుక ఉన్న అసలు రహస్యాలు.. కొత్త పాత్రల ఎంట్రీతో ఈ `మనీ హీస్ట్` ప్రపంచం మరిన్ని సాహసోపేతమైన కథలను మన ముందుకు తీసుకురానుంది.

దోపిడీల నేపథ్యంలో సాగే కథలు కేవలం నేరాలను మాత్రమే కాకుండా, మనుషుల మధ్య ఉండే భావోద్వేగాలు .. వ్యవస్థపై చేసే తిరుగుబాటును ప్రతిబింబిస్తాయి.. అయినా డ‌బ్బు పిచ్చి ఉన్న జ‌నం వీటినే ఎగ‌బ‌డి చూస్తారు!

The Revolution Never Ends… Netflix Money Heist