పెద్ది ట్రైలర్ డేట్ ఫిక్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో ఇప్పటికే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్ల, రెండు చార్ట్ బస్టర్ పాటలు, రెండు డిఫరెంట్ గ్లింప్స్ .. ప్రతి అప్‌డేట్‌కు అద్భుతమైన స్పందన లభించింది. 'పెద్ది', జూన్ 4న పాన్-ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. ఓవర్సీస్ ప్రీమియర్లు జూన్ 3న జరగనున్నాయి.
రిలీజ్ కౌంట్‌డౌన్ ప్రారంభమవుతున్న తరుణంలో చిత్ర నిర్మాతలు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ పాత్రలోని రెండు షేడ్స్ చూపించిన టీమ్, ట్రైలర్‌లో సినిమా అసలు కథ, ప్రధాన పాత్రలను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
అంచనాలను మరింత పెంచుతూ విడుదలైన కొత్త పోస్టర్‌లో రామ్ చరణ్ పూర్తి స్థాయి 1960ల గ్రామీణ యువకుడి లుక్‌లో రైల్వే ట్రాక్‌పై నడుస్తూ కనిపిస్తున్నారు. విజువల్స్‌లోని ప్రతి చిన్న డీటైలింగ్ ఆ కాలాన్ని ఎంత సహజంగా, క్రియేటివ్‌గా రీక్రియేట్ చేశారో ఈ పోస్టర్ స్పష్టంగా చూపిస్తోంది. ఈ కొత్త గెటప్‌లో రామ్ చరణ్ అద్భుతంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో ‘పెద్ది’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ అసాధారణ వేగంతో సాగుతూ కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ రిలీజ్ ను ప్రత్యంగిర సినిమాస్ నిర్వహిస్తోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తి స్థాయిలో రగ్గడ్ మేకోవర్‌తో కనిపించనున్నారు. కథలో విభిన్న టైమ్‌లైన్స్ ఉండటంతో ఆయన పాత్రకు డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయని ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్ స్పష్టం చేశాయి.
జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి బలమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.








































