Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> PM Meets Pawan Kalyan, Enquires About His Health

పవన్ ఆరోగ్యం పై అభిమానుల్లో ఆందోళన

PM Meets Pawan Kalyan, Enquires About His Health

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం ఆయన అభిమానులను అందోళనకు గురి చేస్తుంది. రీసెంట్ గా ఆయన సైనస్ సర్జరీ చేయించుకున్నారు. అంతేకాదు ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. తాజాగా పీఎం మోడీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలిసి ఆయనను పరామర్శించడం చూసిన పవన్ ఫ్యాన్స్ లో ఆందోళన పెరిగింది.

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రస్తుతం ఏపీ లో కేబినేట్ సమావేశాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆయన అధికారానికి కూడా దూరంగా పూర్తి రెస్ట్ లో ఉంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యలు చూసిన ఫ్యాన్స్ ఆయన మళ్లీ సినిమాలు చెయ్యాలంటే పూర్తిగా కోలుకుని తిరిగి వచ్చేసరికి చాలా సమాయం పట్టేలా ఉంది అనేది వారి బాధ.

ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చెయ్యాల్సి ఉండగా.. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియకుండా ఉంది. మరోపక్క పవన్ ఆ దర్శకుడికి కమిట్ అయ్యాడు, ఈ దర్శకుడికి కమిట్ అయ్యాడు అనే వార్తలు పవన్ టీమ్ ఖండిస్తోంది. ప్రస్తుతం పవన్ ఎలాంటి సినిమా ఒప్పుకునే మూడ్ లో లేరు, కాబట్టే ఆయన అభిమానులకు ఆందోళన.

Pawan Kalyan