విజయ్-త్రిష అంతా క్లియర్

Vijay-Trisha all clearVijay-Trisha all clear

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడు సీఎం. నిన్న ఆదివారం విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు. సింగిల్ ఎటం లోనే సీఎం కుర్చీ ని దక్కించుకున్న విజయ్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. అయితే విజయ్ సీఎం అవడం ఒక ఎత్తైతే ఇప్పుడు విజయ్ తో త్రిష రిలేషన్ ఏమిటి అనేది పక్కాగా క్లారిటీ వచ్చేసింది.

నిన్నటివరకు విజయ్-త్రిష ల రిలేషన్ పై రకారకాల ఊహాగానాలు వినిపించాయి. విజయ్-త్రిష రిలేషన్ లో ఉన్నారు అందుకే విజయ్ భార్య సంగీత ఆయనకు విడాకులిస్తుంది అంటూ ప్రచారం జరగడమే కాదు అది నిజమే అనేలా ఇద్దరూ కలిసి పెళ్లికి ఒకే కారులో వెళ్లడం, తర్వాత ఎలక్షన్స్ ముందు నర్మగర్భంగా త్రిష ట్వీట్లు చెయ్యడం చూసాం.

ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారంలో త్రిష మెయిన్ హైలెట్ గా నిలవడమే కాదు.. తమిళనాడు మాజీ సీఎం జయ లలిత మాదిరి ఆమె అభివాదం చెయ్యడం, విజయ్ కన్నా ఎక్కువగా త్రిష నే మెయిన్ హైలెట్ అవడం ఆకర్షించింది. ఇది చూసాక విజయ్-త్రిష మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్ కాదు వారి మద్య రిలేషన్ అనేది ఉంది, ఇదే క్లారిటీ అంటూ మాట్లాడుకుంటున్నారు.

అంతేకాదు విజయ్ త్రిష ను వివాహం చేసుకోవడమే మిగిలి ఉంది అంటూ కామెంట్స్ చెయ్యడం మరో హైలెట్.

Trisha Applauds Vijay at CM Oath Ceremony