విజయ్ ప్రమాణస్వీకారంలో ఫ్యామిలీ మిస్సింగ్

కోలీవుడ్ లో విశేష అభిమాన గణం తో హీరోగా ఎదిగిన విజయ్ ఇప్పుడు పొలిటికల్ స్టార్ గా సత్తా చాటి తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే విజయ్ ఎన్నికల ముందు అటు తన చివరి సినిమా విడుదల కాక, మరోపక్క భార్య సంగీత డివోర్స్ కేసు ఫైల్ చెయ్యడం, పిల్లలు విజయ్ కి దూరంగా ఉండడం వంటి సమస్యలతో బాగా ఇబ్బందిపడ్డారు.
ఎట్టకేలకు విజయ్ సీఎం గా ప్రమాణస్వీకారం చేశారు. ఎలెక్షన్ లో విజయ్ కి సపోర్ట్ చెయ్యని ఆయన భార్య సంగీత, పిల్లలు ఇద్దరూ విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో మిస్ అయ్యారు. అంటే విజయ్ ఇక్కడ చెన్నై లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన భార్య సంగీత పిల్లలు కనీసం ఈ ఈవెంట్ లో కనిపించక పోవడం హాట్ టాపిక్ అయ్యింది.
భార్య తో విభేదాలు ఓకే.. కానీ పిల్లలు తన తండ్రి జీవితంలో కీలకమైన ఘట్టాన్ని మిస్ చేసుకోవడం చర్చకు దారితీసింది. విజయ్ కొడుకు, కుమార్తె, ఆయన భార్య సంగీత విదేశాల్లో ఉండడం వల్లే రాలేదు అని ఒకరు, విజయ్ పై ఫ్యామిలీ కోపంగా ఉంది అని కొందరు మాట్లాడుతున్నారు
మరికొందరు ఆయనకు ఇష్టసఖి త్రిష విజయ్ పక్కన ఉండగా ఇంకా భార్య ఎందుకు పిల్లలు ఎందుకు అంటూ కామెంట్స్ చెయ్యడం హైలెట్ అవుతుంది.








































