కాజల్ కి కలిసిరావడం లేదు
Kajal's Comeback Faces an Unexpected Reality
పెళ్లి తర్వాత కెరీర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అయిన కాజల్ అగర్వాల్ కి రీ ఎంట్రీ అంతగా అచ్చిరాలేదు. ఎప్పటిలానే గ్లామర్ షో చేస్తుంది, తన వయసుకు తగిన పాత్రలు చేస్తుంది. కానీ కాజల్ కి అస్సలు కలిసి రావడం లేదు. బ్యాక్ టు బ్యాక్ షాక్ లు.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో తెలుగులో NBK 111 చిత్రంలో నటిస్తుంది. గతంలో బాలయ్య తో భగవంత్ కేసరి చేసింది. ఇక కాజల్ రీసెంట్ గా నటించిన ది ఇండియా స్టోరీ గత శుక్రవారమే విడుదలైంది. తెలుగు, తమిళ్ లో పోస్ట్ పోన్ చేసి హిందీలో మాత్రమే రిలీజ్ చెయ్యగా ఈ సినిమా అలా అలా గాల్లో కొట్టుకుపోయింది.
కాజల్ ఎంతోకష్టపడి మరీ సింగిల్ హ్యాండ్ తో ది ఇండియా స్టోరీ ని ప్రమోట్ చేసింది. కానీ ది ఇండియా స్టోరీ ని ఆడియన్స్ అసలు పట్టించుకోలేదు. ది ఇండియా స్టోరీ హిందీలో వర్కౌట్ అవ్వలేదు, ఇక తెలుగు, తమిళ్ లో ఏం విడుదల చేస్తారు, చేసినా వర్కౌట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.







































