షాకింగ్: రూ.300 కోట్ల క్లబ్బులోకి జన నాయగన్

Jananayagan In 300 Cr ClubJananayagan In 300 Cr Club


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రంగా గత గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన జన నాయగన్ చిత్రానికి ఏమంత పాజిటివ్ టాక్ రాలేదు. తమిళనాట యావరేజ్ అన్న సినిమాకి తెలుగులో ప్లాప్ టాక్ వచ్చింది. నార్త్ లో విజయ్ జన నాయగన్ ప్రభావం బాగానే కనిపించింది. ఇలాంటి టాక్ తో జన నాయగన్ తో విజయ్ కి మంచి ఫేర్ వెల్ ఇవ్వలేకపోతున్నామని విజయ్ ఫ్యాన్స్ ఫీలయ్యారు.

కానీ జన నాయగన్ కు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే అందరూ షాకవుతున్నారు. వారం తిరగకుండానే జన నాయగన్ చిత్రం రూ.300 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యేందుకు సిద్ధమైంది. విజయ్ స్టామినా, సీఎం గా విజయ్ పవర్, తమిళ ప్రేక్షకులు సీఎం స్థానంలో ఉన్న విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసేందుకు థియేటర్స్ కి క్యూ కట్టారు.

అందుకే ఈ టాక్ తోనూ విజయ్ జన నాయగన్ అద్భుతమైన కలెక్షన్ తీసుకొస్తుంది. అదే విజయ్ ఇంకాస్త మంచి సినిమా తీసి చివరి సినిమా అంటే బాక్సాఫీసు బద్దయిపోయి ఉండేదేమో. భగవంత్ కేసరి చిత్రానికి 50 పర్సెంట్ రీమేక్ గా వచ్చిన జన నాయగన్ తెలుగులో ప్రభావం చూపలేకపోయింది.

కానీ హిందీ, ఓవర్సీస్, తమిళనాట మాత్రం ర్యాంప్ ఆడిస్తుంది అని జన నాయగన్ కల్లెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. 
 

Shocking - Jananayagan enters 300 Cr Club