ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan Advised 8 Weeks of Complete Rest

ఎనిమిది వారాలు విశ్రాంతిలో రామ్ చ‌ర‌ణ్‌!

Ram Charan Advised 8 Weeks of Complete Rest

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  శస్త్రచికిత్స విజయవంతంమైంది.  దీంతో చ‌ర‌ణ్ మొదటిసారిగా సోషల్ మీడియాలో కనిపించారు. లేటెస్ట్ ఫొటోను షేర్ చేస్తూ  తాను క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవ్వ‌డంతో మెగా అభిమానులంతా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

వైద్యుల సూచనల మేరకు రామ్ చరణ్ రాబోయే ఎనిమిది వారాల పాటు పూర్తిగా విశ్రాంతి  తీసుకోవాల్సి ఉంది. సినిమా షూటింగ్‌లకు కొంతకాలం విరామం ఇచ్చి  ఆరోగ్య రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో చ‌ర‌ణ్ త్వరలోనే పూర్తిగా కోలుకుని మరింత శక్తితో తిరిగి వస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు కూడా చ‌ర‌ణ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా? ఆరోగ్యం ముఖ్యంగా  భావించి రామ్ చరణ్ ఈ విరామం తీసుకుంటున్నారు. ఈ విశ్రాంతి కాలం ముగిసిన వెంటనే చ‌ర‌ణ్  తదుపరి ప్రాజెక్ట్‌ల షూటింగ్స్‌లో మళ్లీ ఉత్సాహంగా పాల్గొంటారు. ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `పెద్ది` రిలీజ్ అయి బారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. గ‌త సినిమా `గేమ్ ఛేంజ‌ర్` ఫ‌లితాలు తారు  మారు అయినా?  `పెద్ది` మాత్రం మంచి ఫ‌లితాలు అందించింది. దీంతో చ‌ర‌ణ్ స‌హా ప్రేక్ష కాభిమానులంతా సంతోషంగా ఉన్నారు.

Doctors Recommend 8-Week Break for Ram Charan