రాకా కూడా అదే ఫాలో అవుతున్నాడు

Raaka To Release In Two PartsRaaka To Release In Two Parts


పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో రాకా సినిమా మొదలు పెట్టేసారు. అట్లీ-అల్లు అర్జున్ కలయికలో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ రాకా గా ఫిక్స్ చేసారు. అనౌన్సమెంట్ వీడియో, రాకా గా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అన్ని అభిమానులకే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కి కూడా నచ్చేసింది.

ఈ చిత్రం షూటింగ్ పై మేకర్స్ కే క్లారిటీ లేక రాకా విడుదల తేదీ కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా రాకా కూడా ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నే ఫాలోఅవుతున్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్-అట్లీ కలయికలో రాబోతున్న రాకా చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరి రెండు భాగాలుగా అంటే మరో మూడేళ్లపాటు అల్లు అర్జున్ రాకా పైనే ఉండాలి. రాకా పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ సినిమా ఆపుతారా, లేదంటే రాకా రెండు భాగాలతో పాటుగా లోకేష్ కనగరాజ్ మూవీ చేస్తారో చూడాలి.
 

Raaka Following Tollywood New Trend