ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Heroes Can Learn From Allu Arjun's Bond With Fans

ప్లానింగ్ ఆయన్ని చూసే నేర్చుకోవాలి

Heroes Can Learn From Allu Arjun's Bond With Fans

 

ప్లానింగ్ అల్లు అర్జున్ ని చూసే నేర్చుకోవాలా.. మెగాస్టార్ కి కూడా సాధ్యం కానిది అల్లు అర్జున్ చేసి చూపిస్తున్నారా.. ఇప్పుడిదే టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటలు. ఏ హీరో కూడా అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వని సమయంలో అల్లు అర్జున్ స్పెషల్ గా ఫ్యాన్స్ మీట్ లు పెట్టడమే కాదు వారి కోసం ఇన్సూరెన్స్ చేయించడం అనేది మాములు విషయం కాదు.

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ఇలా అందరూ అభిమానులను కలవాలన్నా చాలా ఆలోచిస్తారు. వారి సినిమాలకు ఈవెంట్స్ కోసం అనుమతులు లభించడం కష్టమే. అయినా వారు సినిమా ఈవెంట్స్ లో ఫ్యాన్స్ ని కలిసి వదిలేస్తారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ లో అభిమానులను సంపాదించుకోవడమే కాదు.. ఇలా దానికి పక్కా ప్లానింగ్ చేస్తున్నారు.

అభిమాన సంఘాలతో కలవడాలు, వారితో ఫోటోలు దిగడం, వారితో మాట్లాడడం అన్ని అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ఆయన గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

How Allu Arjun Redefined the Star-Fan Relationship