అభిమాని నిరంజన్ దగ్గరకు పవన్ కళ్యాణ్
Pawan Kalyan at Warangal Niranjan House
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లో అరుదైన వ్యాధితో పోరాడుతున్న 17 ఏళ్ల నిరంజన్ ని కలిసి పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు. డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం నిరంజన్ తన చివరి కోరికగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ని కలవాలని కోరటంతో స్వయంగా పవన్ ఈరోజు నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించి అభిమాని కోరిక తీర్చారు.
నిరంజన్ ను చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆతనితో చాలా సమయం గడిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయి.. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం అని నిరంజన్ చెప్పిన మాటలు విని పవన్ కలిదిలిపోయిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆతర్వాత నిరంజన్ తల్లితండ్రులతో మాట్లాడి నిరంజన్ వైద్యం, అందుకు అయిన ఖర్చుల గురించి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష ఆర్ధిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని పవన్ చెప్పారు. అలాగే వెంకటేశ్వరస్వామి ప్రసాదాలను నిరంజన్ తల్లితండ్రులకు అందించి వారికి ధైర్యం చెప్పారు.
















































