మతిపోగెట్టేసిన కియారా అద్వానీ
Kiara Advani turned heads with her stunning ramp appearan
హీరోయిన్స్ పెళ్లి చేసుకుని తల్లయ్యాక వారి అందంలో ఎంతో కొంత మార్పు రావడం సహజం. బరువు పెరగడం కానివ్వండి, గ్లో మిస్ అవడం కానివ్వండి ఇలా ఏ విషయంలో నైనా మహిళల్లో ఎంతో కొంత మార్పు వస్తుంది. కానీ బాలీవుడ్ హీరోయిన్స్ కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకుని పిల్లలను ప్లాన్ చేసుకుంటున్నారు.
ఎంత స్పీడుగా తల్లి అవుతున్నారో అంతే స్పీడుగా కెరీర్ లో బిజీ అయ్యేందుకు, కమ్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. కరీనా కపూర్, అలియా భట్, దీపికా పదుకొనె, కియారా అద్వానీ, కత్రినా కైఫ్ లు ఇలానే అందరి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా కియారా అద్వానీ ఓ పాప కు జన్మనిచ్చింది.
ఇప్పుడు కెరీర్ లో కమ్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవడమే కాదు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో కళ్ళు తిప్పుకోకుండా చేస్తుంది. తాజాగా బ్లాక్ మోడరన్ వేర్ లో కియారా అద్వానీ చేసిన గ్లామర్ షో మతిపోగొట్టేసింది అంటే నమ్మాల్సిందే. రీసెంట్ గా ముంబై లో రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన గౌన్ లో మెర్సిడెస్ బెంజ్ కార్ లాంచ్ ఈవెంట్ లో ర్యాప్ వాక్ చేసి కియారా తన అందాలతో అందరి మతులు పోగొట్టేసింది.







































