బిగ్ బాస్ చూడడం లేదంటున్న రోహిత్ ఫ్యాన్స్
Rohit's fans say they are not watching Bigg Boss
అగ్నిపరీక్ష లోనే రోహిత్ ని అభిమానించాం, రోహిత్ ని మా బిడ్డ అనుకున్నాం, బిగ్ బాస్ లో అతన్ని అభిమానించాం, కాని రోహిత్ ని బిగ్ బాస్ నుంచి పంపించేశారు. అందుకే మాకు బిగ్ బాస్ చూడబుద్ది కావడం లేదు, రోహిత్ రీ ఎంట్రీపై వార్తలొస్తున్నాయి. అది నిజమైతే మళ్లీ బిగ్ బాస్ చూస్తాం, లేదంటే లైఫ్ లో బిగ్ బాస్ లైఫ్ లో చూడం అని రోహిత్ అభిమానులు చెబుతున్న మాట.
సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ రోహిత్ ఎలిమినేషన్ ను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అతను అగ్నిపరీక్షలో తన వ్యక్తిత్వానికి, ఆట తీరుకు ముచ్చటపడి అభిమానించిన వాళ్లకు రోహిత్ బిగ్ బాస్ హౌస్ లో ఏమిచ్చాడు, షాకిచ్చాడు. షాలిని తో డీప్ ఫ్రెండ్ షిప్, టాస్క్ లు మానేసి మిగతా కంటెస్టెంట్స్ ని ఎనాలసిస్ చెయ్యడమే పనిగా పెట్టుకున్నాడు.
అయినప్పటికీ ఆయన అభిమానులు రోహిత్ ని నెత్తిన పెట్టుకున్నారు. నామినేషన్స్ లోకి వస్తే అతన్ని టాప్ 1 లో నిలబెట్టేవారు. ఇక హౌస్ లోకి వచ్చిన అపూర్వ, చరణ్, మిగతా వైల్డ్ ఫైర్స్ ఎంత చెప్పినా రోహిత్ లో మార్పు రాలేదు, అయినా అభిమానులు రోహిత్ ని వదిలెయ్యలేదు. అతన్ని ఇంకా అభిమానించారు.
కానీ రోహిత్ చేసుకున్న కర్మ, అహం అతన్ని వదల్లేదు, మిగతా కంటెస్టెంట్స్ తో గొడవ పెట్టుకుని కేవలం ముగ్గురు నలుగురికి సపోర్టుగా ఉన్న రోహిత్ ని మిగతా హౌస్ మేట్స్ నిర్ధాక్షణ్యంగా బయటికి పంపించేశారు. అదే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అతను ఇంకా సుద్దపూసలానే భావిస్తున్నారు తప్ప, రోహిత్ మాదిరి తప్పు ఒప్పుకోలేకపోతున్నారు. పాపం రోహిత్ ఫ్యాన్స్.
















































