ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Dada makers rubbish postponement rumours

బాలయ్య దాదా పోస్ట్ పోన్ నిజామా?

Dada makers rubbish postponement rumoursDada makers rubbish postponement rumours

 

నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో సెకండ్ మూవీగా తెరకెక్కుతున్న దాదా చిత్రం క్రిస్టమస్ స్పెషల్ గా డిసెంబర్ 24 రిలీజ్ అంటూ ఎపుడో రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. బాలయ్య గనక సెట్ లో గాయపడకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే దాదా రిలీజ్ అవ్వాలి. కానీ బాలయ్య మోకాలికి గాయమవడం, సర్జరీ జరిగి రెండు నెలలు రెస్ట్ తీసుకోవడంతో దాదా డిసెంబర్ 24 కి వెళ్ళింది.

అయితే దాదా ప్రమోషన్స్ మొదలు కాకపోవడం, దాదా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈరోజు ఉన్నట్టుండి దాదా పోస్ట్ పోన్ అవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దాదా డిసెంబర్ 24 నుంచి పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఏడాది మార్చి కి వెళ్లబోతుంది అంటూ హడవిడి మొదలు పెట్టారు.

కానీ దాదా మేకర్స్ దాదా డిసెంబర్ 24 నే రిలీజ్ అవుతుంది. దాదా ఫస్ట్ సింగిల్ వెరీ వెరీ సూన్, ప్రామిస్ చేసి చెబుతున్నాం దాదా క్రిస్టమస్ కి వస్తుంది అంటూ దాదా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వేశారు. సో దాదా పోస్ట్ పోన్ వార్తలు నమ్మక్కర్లేదు, అభిమానులు కంగారు పడక్కర్లేదన్నమాట. 
 

Dada makers come up with a powerful update