ఆసుపత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్
Ram Charan discharged from hospital
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు రోజుల క్రితమే మణికట్టు సర్జరీ కోసం కోయంబత్తూరులోని గంగ ఆసుపత్రిలో చేరారు. పెద్ది చిత్ర షూటింగ్ లో జరిగిన ప్రమాదం వలన రామ్ చరణ్ చేతి మణికట్టుకు గాయమైంది. గత మూడు నెలలుగా చరణ్ కట్టుతోనే కనిపించారు. పెద్ది విడుదల అయ్యాక కొద్దిగా గ్యాప్ తీసుకుని చరణ్ మణికట్టుకు కి సర్జరీ చేయించుకున్నారు.
రామ్ చరణ్ సర్జరీ విజయవంతమైంది అని డాక్టర్స్ రామ్ చరణ్ హెల్త్ అప్ డేట్ కూడా ఇచ్చారు. చరణ్ ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. అయితే రామ్ చరణ్ సర్జరీ కోసం కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఆయన వెంట భార్య ఉపాసన, తండ్రి చిరు, తల్లి సురేఖ వెళ్లారు.
ఈరోజు రామ్ చరణ్ గంగ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ ఉంచి చరణ్ నేరుగా తన ఫ్యామిలీతో పాటుగా హైదరాబాద్ చేరుకున్నారు.
Ram Charan Discharged After Successful Wrist Surgery







































