తనూజ లో ఎంత చేంజ్
Thanuja latest photoshoot viral
బిగ్ బాస్ హౌస్ లో తనదైన స్టయిల్, తనదైన అందంతో అందరి హృదయాలను ముఖ్యంగా యూత్ మనసు దోచేసిన తనూజ పుట్టస్వామి.. హౌస్ లో ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ తో మెస్మరైజ్ చేసింది. బిగ్ బాస్ లో విన్నర్ అవుతుంది అనుకున్న తనూజ రన్నర్ గా బయటికొచ్చింది. ఆతర్వాత ఆమె చాలా అరుదుగా మీడియా ముందు కనిపించింది.
చీర కట్టులో చక్కగా చందమామలా కనిపించే తనూజ సీరియల్స్ తియ్యడం లేదు, ఆమె నటించిన ఓ వెబ్ సీరీస్ రావాల్సి ఉంది. ఈలోపు అప్పుడప్పుడు రిబ్బన్ కటింగ్స్ అంటూ షాప్ ఓపెనింగ్ కి వెళుతుంది. ఇక స్టార్ మాకి చానళ్ళు దూరంగా ఉన్న తనూజ కుకు విత్ జాతిరత్నాలు షో లో పాల్గొంటుంది.
తాజాగా తనూజ చేయించుకున్న ఓ ఫోటో షూట్ చూసి.. అబ్బ తనూజ లో ఎంత చేంజ్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. చేతిలో బ్యాగ్ తో స్టైలిష్ లుక్ లో తనూజ యూత్ మనసులను మెలిపెట్టే ఫోజులతో అద్దరగొట్టేసింది. ప్రస్తుతం తనూజ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.







































