ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Toxic to unveil grand trailer in Bengaluru

యశ్ టాక్సిక్ ట్రైలర్ ఎప్పుడంటే..

Toxic to unveil grand trailer in Bengaluru


పాన్ ఇండియా స్టార్, కన్నడ హీరో యష్ నుంచి ఆగష్టు 26 న రాబోతున్న టాక్సిక్ మూవీ ప్రమోషన్స్ ను టీమ్ అగ్రెసివ్ గా మొదలు పెట్టేసింది. ఇప్పటివరకు టాక్సిక్ నుంచి వచ్చిన టీజర్, రెండు పాటలు బోల్డ్ కంటెంట్ తో నిండిపోయి ఉన్నాయి. పెద్దలకు మాత్రమే అని సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా టాక్సిక్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఉంది.

టాక్సిక్ ట్రైలర్ లో ఏమైనా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాపై ఆసక్తితో కూడిన కంటెంట్ వదులుతారేమో అని ఆడియన్స్  చూస్తున్నారు. యష్ టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం పెట్టేసారు. ఆగస్టు 8  బెంగుళూరులో టాక్సిక్ ట్రైలర్ వదిలేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో యశ్ ఇంకా హీరోయిన్స్ హైలెట్ అవ్వనున్నారు.

ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు కానీ.. టాక్సిక్ ట్రైలర్ ఆగష్టు 8 న విడుదల కావడం పక్కా. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి ఇలా చాలామంది హీరోయిన్స్ కనిపించబోతున్నారు. అన్నట్టు నయనతార ఈ చిత్రాల్లో స్మోక్ చేస్తూ కనిపించడం అందరికి షాకిచ్చింది. మరి టాక్సిక్ ట్రైలర్ ఎలా ఉండబోతుందో జస్ట్ వెయిట్ అండ్ సి.

 

Toxic: Trailer of Yash starrer to reportedly launch in Bengaluru on August 8