జై హనుమాన్: అశ్వద్ధామ గా రానా

 Rana to Play AshwatthamaRana to Play Ashwatthama

 

కల్కి 2 లో అశ్వద్ధామ పాత్రలో బిగ్ బి అమితాబ్ ఎంతగా మెప్పించారో అందరూ చూసారు. పాన్ ఇండియా లెవల్లో అమితాబ్ కేరెక్టర్ హైలెట్ అయ్యింది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు ఈ అశ్వద్ధామ కేరెక్టర్ లో కనిపించబోతున్నారనే వార్త వైరల్ అవడం కాదు అది  నిజమేనట. ఆ హీరో ఎవరంటే కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించని భల్లాలదేవుడు దగ్గుబాటి రానా.

కొన్నాళ్లుగా వెండితెరపై ప్రోపర్ గా కనిపించని రానా ఇప్పుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం జై హనుమాన్ లో అశ్వద్ధామగా కనిపించబోతున్నాడట. జై హనుమాన్ లో రానా నటిస్తున్నాడు. కానీ ఆయన కేరెక్టర్ ఇప్పుడు రివీల్ అయ్యింది. ప్రశాంత్ వర్మ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా ఫిలిం హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ చేస్తున్నారు.

రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించబోతున్న ఈచిత్రం లో రానా అశ్వద్ధామ పాత్ర చేస్తున్నారు. మహాభారతంలో ఎంతో కీలకమైన ఈ అశ్వద్ధామ పాత్రను రానా పోషించడం ఇంట్రెస్టింగ్ గా మారింది.  

Jai Hanuman: Rana to Play Ashwatthama