కంగనా కు కౌంటర్ అదిరిపోయింది

CJP takes swipe at Kangana Ranaut


నీట్ పేపర్ లీక్ కి వ్యతిరేఖంగా ఢిల్లీ లో జంతర్ మంత్ర వద్ద బోదింకల పార్టీ సిజేపీ చేసిన ఆందోళన పర్యవసానం ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. ఇది నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల విజయమని, సిజేపీ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్న సమయంలో బిజెపి ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ కాంట్రవర్సీ పోస్ట్ సంచలనంగా మారింది.

ఆమె సోషల్ మీడియా వేదికగా.. నిరసనకారుల మూక తమపై దాడి చేస్తుందేమోనని పార్లమెంట్‌లోని ఎంపీలంతా భయపడ్డామని, ఢిల్లీ పోలీసులు తమకు రక్షణ కవచంగా మారారు అని, నిరసనకారుల నిరసనలు, వారు మాట్లాడుతున్న భాష వింటే వాంతి వస్తుంది, మిమ్మల్ని మీరు బొద్దింకలని పిలుచుకుంటారు, చూడటానికి, ప్రవర్తించడానికి కూడా అలాగే ఉంటారు.

ఇందులో ఎలాంటి వైరుధ్యం గానీ, పొంతన లేకపోవడం గానీ లేదు, కేవలం మీ మురికి, చెత్త, వికారానికి ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేయడమే.. జెన్ జి అంటూ నిరసన చేసిన అమ్మాయిలు సంసారానికి పనికిరారు అంటూ సిజేపీ ని అవమానిస్తూ కంగనా చేసిన పోస్ట్ కి తాజాగా సిజేపీ కౌంటర్ ఇచ్చింది.

ఉన్నత స్థానాల్లో వున్నవాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి, దేశానికి నీవు చేసిన దానికంటే జెన్ జీనే ఎక్కువ చేసిందని గుర్తు పెట్టుకో, నిన్ను నీ పార్టీనే సీరియస్ గా తీసుకోవడం లేదు, నువ్వు మా గురించి మాట్లాడతావా అంటూ కంగనాకు సిజేపీ అదిరిపోయే కౌంటర్ వేసింది.  
 

CJP hits back at Kangana Ranaut