ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jayam Ravi gets a big relief in divorce case

ఆ హీరో కి కోర్టు హెల్ప్ చేసింది

Jayam Ravi gets a big relief in divorce case


కోలీవుడ్ హీరో జయం రవి కి చెన్నై ఫ్యామిలీ కోర్టు నెత్తిన పాలు పోసింది. జయం రవి తనకు నెలకు రూ.40 లక్షల భరణం చెల్లించాలని కోర్టులో వేసిన పిటిషన్ ని చెన్నై ఫ్యామిలీ కోర్టు కొట్టిపారేస్తూ నెలకు జయం రవి నుంచి మూడు లక్షల రూపాయల భరణం తీసుకోవాలని తీర్పునిచ్చింది.

గత రెండేళ్లుగా ఆర్తి-రవి మోహన్ మధ్యన విభేదాలు నడుస్తున్నాయి. తన భార్య ఆమె తల్లి మానసికంగా బాధపెడుతున్నారు, తన ఆస్తులన్నీ వారు లాగేసుకున్నారు, తన పిల్లలను కూడా చుడనివ్వకుండా తన భార్య ఆర్తి తనని వేధిస్తుంది, పలుమార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, అంటూ జయం రవి డైరెక్ట్ గా మీడియా ముందే చెప్పాడు.

అటు ఆర్తి జయం రవి తనను, తన పిల్లను పట్టించుకోకుండా సింగర్ కేనీషా తో సంబంధం పెట్టుకున్నాడు, తన పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నాను, తనకు వేరే సోర్స్ కూడా ఏమి లేదు, తనకు జయం రవి నుంచి నెలకు రూ.40 లక్షల భరణం కావాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది. విడాకుల కేసు నడుస్తున్న సమయంలోనే ఆర్తి భరణం కోసం కోర్టుకు వెళ్ళింది. దానితో నెటిజెన్స్ ఆర్తిని ఏకిపారేసారు.

ఇప్ప్పుడు కోర్టు కూడా జయం రవికి హెల్ప్ చేసింది. నెలకు రూ.40 లక్షలు కాదు, రవి తన మాజీ భార్యకు కేవలం మూడు లక్షలు భరణం చెల్లించాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. 

Jayam Ravi Divorce - Court Rejects 40 Lakh Maintenance