ఈ హీరోయిన్ కి అదృష్టం తలుపు తట్టేనా?
Actress Bhagyashri Borse
ఇప్పటికి మూడు సినిమాలు చేసింది. కానీ అమ్మడుకి ఒక్క హిట్టు కూడా తగల్లేదు. అందం ఉంది, గ్లామర్ షో చేస్తుంది, కాని అదృష్టమే ఆవగింజంతైనా లేదు అనేలా ఉంది. ఆమె ఎవరో కాదు మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ అప్పుడే భాగ్యశ్రీ అందాలు గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది.
ఆ సినిమా డిజప్పాయింట్ చేసినా భాగ్యశ్రీ బోర్సే కి మంచి మంచి అవకాశాలొచ్చాయి. శ్రీలీల వదులుకున్న కింగ్ డమ్, రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాలు చేసింది. అవి కూడా సో సో గానే మిగిలిపోయాయి. ఇప్పుడు అమ్మడు అదృష్టం మొత్తం లెనిన్ పైనే ఆధారపడి ఉంది.
భారతి గా లెనిన్ లో అఖిల్ ని ప్రేమించే పల్లెటూరి అమ్మాయిగా, భార్యగా ఆ కేరెక్టర్ లో కనిపించనుంది. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ తో భాగ్యశ్రీ ఈ చిత్రంలో కనిపించడమే కాదు ప్రమోషన్స్ లోను అందరి చూపు తన వైపే ఉండేలా అమ్మడు ప్రత్యేకంగా రెడీ అయ్యి కనిపించింది.
ఈ చిత్రం కోసం భాగ్యశ్రీ చాలా కష్టపడింది. కష్టానికి ఫలితం దక్కి లెనిన్ తో భాగ్యశ్రీ కి లెనిన్ తో అదృష్టం తలుపు తట్టాలని ఆమె ఫ్యాన్స్ అయితే బలంగా కోరుకుంటున్నారు.







































