ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> CM Revanth Reddy makes pooris for grandson

మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy makes pooris for grandson

 

రాష్ట్రానికి సీఎం అయినా మనవడికి తాతే, కూతురుకి తండ్రే, భార్యకి భర్తే. ఇంటికి యజమానే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణాలో అనేక సమస్యలు, ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు, క్యాబినెట్ మీటింగ్స్, ప్రతిపక్షాలతో ఫైటింగ్, ఇలా నిత్యం బిజీ షెడ్యూల్స్ ని మైంటైన్ చేసే వ్యక్తి.

అంతటి బిజీ అయిన రేవంత్ రెడ్డిని ఆయన ఎంతగానో ప్రేమించే మనవడు పూరీలు కావాలని మారం చేస్తే తప్పదుగా, వండాల్సిందే. తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా అని మనవడు మారం చేసి అడిగితే తప్పుతుందా? పనులన్నీ పక్కన పెట్టి మనవడు కోసం రేవంత్ రెడ్డి పూరీలు చేసి పెట్టిన వీడియో వైరల్ అవుతుంది.

పక్కనే మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...  బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తను మనవడి కోసం వేసిన పూరీల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.  

Telangana CM Revanth Reddy Makes Poori For His Grandson