మెగాస్టార్ అంటేనే కష్టానికి మరో పేరు!
Chiru158 Rain Stunt Sequence For 12 Hours In A Single Dayమెగాస్టార్ చిరంజీవి వయసు 70 ఏళ్లు. ఈ వయసులో చాలా మంది విశ్రాంతి కోరుకుంటారు. కానీ మెగాస్టార్ మాత్రం కెరీర్ మొదట్లో ఉన్నంత ఉత్సాహంతో ఇప్పటికీ సెట్స్‌లో దూసుకుపోతున్నారు. ఆయన తదుపరి చిత్రం మెగా 158 కోసం చిరంజీవి పడుతున్న కష్టం చూస్తుంటే? ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు 12 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తూ యంగ్ హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో సెట్స్‌లో చురుగ్గా ఉంటున్నారు.
మెగా 158 కోసం చిరంజీవి హార్డ్ వర్క్ గురించి చిత్ర యూనిట్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇతర స్టార్ హీరోలు కూడా చేయలేనంతగా చిరంజీవి ఒక్కో సీన్ కోసం శక్తిని ధారపోస్తున్నారు. ఎండలో షూటింగ్ చేసినా? యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం? గంటల తరబడి శ్రమించినా అన్నయ్య ముఖంలో అలసట కనిపించలేదంటున్నారు. ఈ అంకితభావమే మెగాస్టార్ ని దశాబ్దాలుగా నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది.
సాధారణంగా అగ్ర హీరోల సినిమాలకు బాడీ డబుల్స్ లేదా డూప్స్‌ని ఎక్కువగా వాడుతుంటారు. కానీ 158 కోసం చిరంజీవి కష్టమైన యాక్షన్ సన్నివేశాలను కూడా తానే స్వయంగా చేస్తున్నారట. స్టంట్ మాస్టర్స్ జాగ్రత్తలు చెబుతున్నా? ఆ పర్ఫెక్షన్ కోసం మళ్ళీ మళ్ళీ రిహార్సల్స్ చేస్తున్నారుట. చిరంజీవి కెరీర్ బిగినింగ్‌లో ఎలాగైతే కష్టపడేవారో? ఇప్పుడు కూడా అదే క్రమశిక్షణను పాటించడం అభినందనీయం.
ఈ కష్టానికి కారణం పాత్ర పట్ల ఆయనకున్న క్లారిటీ. కథాంశంపై పట్టు ఉండటం వల్లే, ఆ పాత్రను మరింత సహజంగా తీసుకురావడానికి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. సెట్స్‌లో జూనియర్ నటులు, టెక్నీషియన్లతో కలివిడిగా ఉంటూ వారితో పాటు తాము కూడా కష్టపడుతుంటే? ఆ ఎనర్జీ అందరికీ పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. చిరంజీవి ఉత్సాహం చూసి మిగిలిన యూనిట్ సభ్యులు కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు.







































