Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Censor Clearance Pending For Salman Khan Matrubhumi

పెద్ద స్టార్స్ అయినా సెన్సార్ లెక్క చెయ్యదు

Censor Clearance Pending For Salman Khan Matrubhumi

 

ఈమధ్యన సెన్సార్ బోర్డు పెద్ద హీరోల సినిమాలైనా లెక్క చెయ్యట్లేదు. సినిమా చూసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు పలు అభ్యంతరాలు పెడుతుంది. ఇంతకుముందు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్ నే తీసుకోండి.. గత ఆరు నెలలుగా నిర్మాతలు సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఫైట్ చేసి చివరికి A సర్టిఫికెట్ తెచ్చుకున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ సినిమాకి అదే సమస్య వచ్చింది. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ చిత్రం మాతృభూమి కి సెన్సార్ చిక్కులొచ్చిపడ్డాయి. మాతృభూమి చిత్రంలోని చైనాకు సంబంధించిన కొన్ని సీన్స్, 2020లో జరిగిన గురుగ్రామ్ అల్లర్లకు సంబంధించిన కొన్ని ఒరిజినల్ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని...

అంతేకాకుండా ఒక రీమేక్ పోస్టర్ కనిపించే షాట్, కొన్ని డైలాగులపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపినట్లుగా తెలుస్తుంది. వాటిలో కొన్ని మార్పులు సెన్సార్ బోర్డు మాతృభూమి నిర్మాతలకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే ఓ 40 సెకన్ల సీన్ ని పూర్తి గా తీసేయాలని, అభ్యంతరకరమైన పదాలను మ్యూట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు సూచించినట్లుగా తెలుస్తుంది.

మరి హీరో ఎవరు అనేది సెన్సార్ బోర్డు కి అనవసరం. వారికి అభ్యంతరకర సన్నివేశాలు ఉంటె వాటిని తొలగించనిదే సెన్సార్ సర్టిఫికెట్ కూడా ఇవ్వదు.

Salman Khan Films Denies Censor Clearance Pending