Advertisement

ఇలా అయితే థియేటర్స్ కి జనాలు రారు

Audience - Theatres


నిజంగానే భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతుంటే టికెట్ రేట్లు పెంచమని నిర్మాతలు సీఎం ల చుట్టూ తిరుగుతున్నారు. వారు కూడా సినిమా వాళ్లతో ర్యాపొ కోసం టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఆ పెరిగిన టికెట్ ధరలతో సామాన్యుడు సినిమాలు చూసేదుకు ఇంట్రెస్ట్ చూపించక థియేటర్స్ కి దూరమవుతున్నారు.

అదే సమయలో భారీ బడ్జెట్ సినిమాలైనా నాలుగు వారాలకే ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంటే.. పెరిగిన టికెట్ రేట్ల తో థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసి జేబులకు చిల్లుపడేలా ఎవరైనా ఎందుకు చేసుకుంటారు. ఓటీటీ లోకొచ్చాకే సినిమా చూస్తారు. నిర్మాతలు మాకు నష్టాలొస్తున్నాయని తెగ బాధపడిపోతుంటారు. అంతంత బడ్జెట్ లు పెట్టడమెందుకు.

హీరోలకు భారీగా పారితోషికాలు ఇవ్వడమెందుకు, లాస్ వచ్చింది అని ఏడవడం ఎందుకు. పెద్ది నే తీసుకోండి.. టికెట్ రేట్లు పెరిగాయి. ఒకటి రెండు వారాలు బాగానే ఆడింది, ఆతర్వాత  ఓటీటీ పై న్యూస్ లు, మరోపక్క పెరిగిన టికెట్ రేట్ల భారం. వెరసి పెద్ది ని థియేటర్స్ లో చూసే వాళ్లే కరువయ్యారు.

ఇప్పుడు ఈ చిత్రం నాలుకు వారాలకే అంటే 35 రోజులకే ఓటీటీ లోకి వస్తుంది. ఇక థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడండి అనే హక్కు కూడా నిర్మాతలు కోల్పోయినట్లే.. అడిగేందుకు అర్హత కూడా లేనట్లే కదా!

OTT - Theatres