దేశాధ్యక్షుడి అంత్యక్రియల్లో 3000 మంది మరణం!?
3,000 people died at the President's funeral!?
అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన నాలుగు నెలల తర్వాత.. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రాంగణంలో ఆయన అంత్యక్రియల వేడుకలు అత్యంత ఉద్రిక్త వాతావరణంలో ప్రారంభమయ్యాయి. నల్లటి దుస్తులు ధరించి.. జాతీయ జెండాలతో లక్షలాదిగా తరలివచ్చిన జనం శవపేటికల సాక్షిగా `ప్రతీకారం` అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తుండటంతో టెహ్రాన్ వీధులు హోరెత్తుతున్నాయి.
అయితే ఈ భారీ శోకసంద్రంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల భయంతోనే ఆయన బహిరంగంగా రాకుండా కేవలం సీనియర్ మతగురువుల ద్వారానే ప్రార్థనలు జరిపిస్తున్నట్లు అంతర్జాతీయ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు..ఈ అంత్యక్రియల వెనుక అత్యంత భయానకమైన అంతర్గత ముప్పు పొంచి ఉందంటూ జర్మన్ పత్రిక `డై వెల్ట్` సంచలన నివేదికను బయటపెట్టింది. వేసవి తీవ్రత, విపరీతమైన జనం వల్ల సంభవించే తొక్కిసలాటలో ఏకంగా 1,500 నుండి 3,000 మంది వరకు మరణించే ప్రమాదం ఉందని ఇరాన్ రెడ్ క్రెసెంట్ - నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ సంస్థలు వైస్ ప్రెసిడెంట్‌కు పంపిన ఒక రహస్య లేఖలో హెచ్చరించాయి.
ఈ ఊహించని ఘోరకలిని ఎదుర్కొనేందుకు టెహ్రాన్ మున్సిపాలిటీ అధికారులు ముందుగానే అత్యవసర ఏర్పాట్లతో సిద్ధమవ్వడం కలకలం రేపుతోంది. మృతదేహాలను ఒకేసారి పూడ్చాల్సి వస్తే అనే ఆలోచనతో ముందే వేలాది సమాధులు తవ్వి ఉంచారట. టెహ్రాన్, కోమ్ నగరాల మీదుగా సాగి ఇరాక్‌లోని పవిత్ర నగరాలను తాకుతూ జూలై 9 నాటికి మషద్‌లో ముగిసే ఈ అంత్యక్రియల యాత్ర.. ఇరాన్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన భారీ ఈవెంట్‌గా మారబోతోంది.








































