పెద్ది ఓటీటీ డేట్ లాక్డ్
Peddi OTT release date locked.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది. ఈచిత్రం జూన్ 4 న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది కలెక్షన్స్ పరంగా దున్నేస్తే పాన్ ఇండియాలోని కొన్ని భాషల్లో పెద్ది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పాన్ ఇండియా లో అతి పెద్ద మర్కెట్ ఓవర్సీస్ ఇంకా నార్త్ లో పెద్ది ప్రభావం కనిపించలేదు.
అయినప్పటికి రూ.400 కోట్ల క్లబ్బులోకి చేరిన పెద్ది చిత్ర ఓటీటీ రిలీజ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ కన్ను పడింది. ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ అయిన పెద్ది విషయంలో దీని ఓటీటీ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ పెద్ది డీల్ నుంచి కొంత మినహాయించుకుంది అనే న్యూస్ ఉంది. అయినప్పటికి భారీ డీల్ తోనే పెద్ది డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్ చేజిక్కించుకుంది.
అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు నెల రోజులు పూర్తి కాగానే ఓటీటీ లోకి తీసుకురాబోతున్నారు. కేవలం నాలుగు వారాల గ్యాప్ లోనే పెద్ది నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది. అంటే థియేటర్స్ లో జూన్ 4 న విడుదలైన పెద్దిని జులై 9 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.








































