Advertisement

పాత మిత్రుల క‌ల‌యిక‌తో మురిసిపోయిన సీనియ‌ర్!

 

చాలా కాలం త‌ర్వాత ర‌వీనా టాండ‌న్ ,అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి `వెల్కమ్ టు ది జంగిల్` చిత్రంతో ఒకే ప్రేమ్ లో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో ర‌వీనా షూటింగ్ అనుభవాలను గుర్తు  చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌లా కాకుండా పాత స్నేహితులందరూ ఒకచోట చేరి జరుపుకున్న వేడుకలా సాగిందని పేర్కొన్నారు. గతంలో తామంతా కలిసి ఎన్నో ఏళ్లపాటు పని చేయడం వల్ల సెట్స్‌పై ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని.. ఆ సరదా వాతావరణంలోనే  అద్భుతమైన సినిమా వ‌చ్చింద‌ని   ఆనందం వ్యక్తం చేశారు.

అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్, సునీల్, రవీనాలతో పాటు అర్షద్ వార్సీ, పరేష్ రావల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ వంటి ఎందరో సీనియర్, జూనియర్ నటీనటులు సందడి చేశారు. అనుభవజ్ఞులైన తారాగణాన్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా  సమర్థవంతంగా  సులువుగా హ్యాండిల్ చేసినందుకు రవీనా టాండన్ దర్శకుడు అహ్మద్ ఖాన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

రవీనా టాండన్ గతంలో అక్షయ్ కుమార్‌తో కలిసి `మోహ్రా`, `ఖిలాడియోన్ కా ఖిలాడీ` వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే సునీల్ శెట్టితో కలిసి `దిల్‌వాలే`, `వినాశక్`, `రక్షక్` వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ ఒకే తెరపై కనిపించడం పట్ల అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. 

Raveena Tandon on reuniting with his old friends