Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Mohan House Theft Driver Arrested

రవి మోహన్ డ్రైవర్ అరెస్ట్

Ravi Mohan House Theft Driver Arrested


కోదిరోజుల క్రితం కోలీవుడ్ హీరో రవి మోహన్ తన ఇంట్లో దొంగతనం జరిగింది, రూ.10 లక్షల డబ్బు, ఒక విలువైన డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదని పోలీస్ లకు ఫిర్యాదు చేసారు. తాజాగా ఈకేసులో పోలీసులు రవిమోహన్ డ్రైవర్ ను అరెస్ట్ చేసారు. ఆయన వ్యక్తిగత కారు డ్రైవర్‌ రవి మోహన్ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

నిందితుడి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని.. నగదు తో పాటుగా కనిపించకుండా పోయిన రూ.10 లక్షల విలువైన వజ్రాల నెక్లెస్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. దొంగతనం జరిగినప్పుడు రవి మోహన్ తన ఇంట్లోని పనివాళ్లను, సిబ్బందిని నిర్బంధించి ప్రశ్నించడం తెలుసుకున్న పోలీసులు రవి మోహన్ ఇంటికి చేరుకొని విచారణ చేపట్టారు.

తమకు కంప్లైంట్ ఇవ్వకుండా ఇలా సిబ్బందిని నిర్బంధించి విచారణ చెయ్యకూడదని పోలీసులు చెప్పడంతో రవి మోహన్ మేనేజర్ అధికారిక ఫిర్యాదులో ఇంటి లాకర్ నుంచి రూ.10 లక్షల నగదు, ఒక విలువైన డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టి రవి మోహన్ వ్యక్తిగత డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడినట్లుగా తెలుస్తుంది.

Ravi Mohan House Theft Driver Arrested For Stealing Cash