దసరా ని లైట్ తీసుకుంటున్న NBK 111
Balakrishna-Gopichand Malineni Film Eyes December
ఈ దసరా బరిలో సీనియర్ హీరోలు ఉంటారనే ప్రచారం జరిగింది. బాలయ్య NBK 111, చిరు విశ్వంభర, నాగ్ 100 మూవీ. కానీ ఒక్క వెంకీ మాత్రమే అక్టోబర్ 2 అంటూ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ లాక్ చేసారు. మిగతా ముగ్గురు హీరోలు లైట్ గా ఉన్నారు. అందులో చిరు విశ్వంభర ఏమైనా కదిలితే కదలొచ్చు. మిగతా బాలయ్య, నాగ్ దసరా ని లైట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న NBK111 మూవీ దసరా స్కిప్ చేసి డిసెంబర్ పై కన్నేసినట్లుగా తెలుస్తుంది. ముందుగా సంక్రాంతి అనుకున్నా అప్పుడు బాక్సాఫీసు సిట్యువేషన్ టైట్ గా ఉండడంతో బాలయ్య-గోపీచంద్ లు డిసెంబర్ లో రావడమే బెటర్ అనుకుంటున్నారట.
బాలయ్య బర్త్ డే కి విడుదలైన NBK 111 పవర్ ఫుల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు బాగా పెంచేసాయి. న్యూ ఏజ్ అంటూ బాలయ్య స్టైలిష్ లుక్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. మరి డిసెంబర్ లో NBK 111 3 న వస్తుందా, లేదంటే క్రిష్ట్మస్ బరి ని ఖాయం చేసుకుంటుందా అనేది చూడాలి.







































