టాలీవుడ్ యువ‌ హీరో సీక్రెట్ పెళ్లి?

Young hero secret marriage

 

ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్ర‌ముఖ‌ టాలీవుడ్ యంగ్ హీరో గురించి కొన్ని ఆసక్తికరమైన గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక బ్లాక్‌బస్టర్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడికి సంబంధించిన ఒక ముఖ్య విష‌యం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా బయట కనిపించే ఒక `మిడిల్ క్లాస్ స్ట్రగ్లర్` ఇమేజ్‌కి భిన్నంగా అత‌డి వ్యక్తిగత జీవితం, సినిమా సెట్స్‌లో అత‌డి ప్రవర్తన గురించి ఇంటర్నెట్‌లో ప్రచారం ఉంది.

అన్నింటికంటే పెద్ద షాకింగ్ గాసిప్ ఏమిటంటే.. ఆ యంగ్ హీరోకి సీక్రెట్‌గా పెళ్లయిపోయింది. అత‌డు అమెరికాలో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారని, ఆ విషయం బ‌య‌ట‌కు తెలియ‌కుండా చాలా సీక్రెట్‌గా ఉంచారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. యువ‌హీరో భార్య గతంలో అమెరికాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన ఒక నటి అనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ యంగ్ హీరో నటిస్తున్న ఒక భారీ చిత్రానికి త‌నే క్రియేటివ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించినట్లు టాక్. అయితే ఈ పెళ్లి వార్తలపై సదరు యంగ్ హీరో నుండి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ, స్పందన కానీ లేదు.

ఈ యంగ్ హీరో కెరీర్ జ‌ర్నీపైనా గాసిప్ వైర‌ల్ అవుతోంది. అత‌డు క‌థ‌ల్లో ఇన్వాల్వ్ అవుతాడ‌ని నిర్మాత‌ల‌తో గొడ‌వ ప‌డ‌తాడ‌ని కూడా ఒక ప్రచారం ఉంది. ఆటిట్యూడ్, సీక్రెట్ లైఫ్, బ్యాక్‌గ్రౌండ్ గురించి ఇన్ని నెగెటివ్ రూమర్స్ వస్తున్నా.. అత‌డితో కలిసి పనిచేసిన స‌హ‌చ‌రులు, టెక్నీషియ‌న్లు మాత్రం ఈ హీరోకు మద్దతుగా నిలుస్తున్నారు. యువ‌హీరో సినిమా సెట్స్‌లో పనిచేసిన ఒక క్రూ మెంబర్ మాట్లాడుతూ.. ఈ యంగ్ హీరో ఒక పర్‌ఫెక్ట్ ప్రొఫెషనల్ న‌టుడు అని, కథ విషయంలో చాలా కేర్ తీసుకుంటారని, పని తప్ప వేరే విషయాలను అస్సలు పట్టించుకోరని స్పష్టం చేశారు. అలాగే ముంబై వీధుల్లో ఈ హీరోను చూసిన కొందరు ఫ్యాన్స్.. ఆయన స్క్రీన్ మీద కనిపించే అంత అల్లరిగా కాకుండా.. రియల్ లైఫ్‌లో చాలా ప్రశాంతంగా, సైలెంట్‌గా ఉంటారని చెప్పుకొచ్చారు. ఒక ర‌కంగా నెగెటివ్ ప‌బ్లిసిటీ వెన‌క ఇంకేదైనా కార‌ణం ఉంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ఓవ‌రాల్ గా రెడ్డిట్‌లో ఈ చ‌ర్చ ముక్కున వేలేసుకునేలా ఉంది.

Is This Young hero Got Married Secretly