లైనప్ కాదు క్వాలిటీ ముఖ్యం

Ravi Teja Solid Lineup



మాస్ మహారాజ్ రవితేజ ఒక సినిమా ఫినిష్ అవ్వకుండానే మరో సినిమాని సెట్ పైకి తీసుకెళ్లే హీరో. ఎనర్జిటిక్ గా ఉండే రవితేజ వరస సినిమాల చెయ్యడం అభిమానులకు హ్యాపీనే. కానీ రవితేజ లైనప్ ల మోజులో పడి కంటెంట్ ని లైట్ తీసుకుంటుంన్నారనే వాదన అభిమానుల నుంచే వ్యక్తం అవుతుంది.

మరోపక్క ఫిట్ గా ఉండేందుకు రవితేజ నిత్యం జిమ్ లో కష్టపడి శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటున్నారు కానీ ఆయన ఫేస్ లో గ్లో పోతుంది. రవితేజ లుక్స్ పై గత కొన్ని సినిమాల నుంచి తీవ్ర విమర్శలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి చేస్తున్నారు. ఆ చిత్రం ఆగష్టు 21 రిలీజ్.

ఈలోపే రవితేజ లైనప్ లో చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో ఓ కొత్త దర్శకుడితో, కోలీవుడ్ పవర్ ఫుల్ యాక్షన్ డైరెక్టర్ హరి, వివేక్ ఆత్రేయ ఇలా చాలామంది దర్శకులు రవితేజ లైనప్ లో కనిపిస్తున్నారు. గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చెయ్యడం ఫ్యాన్స్ కి నచ్చుతుంది.

కానీ క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో రవితేజ స్పెషల్ ఫోకస్ పెడితేనే కానీ లేదంటే ఆయనకు విజయం దొరకదు అనేది అభిమానుల అభిప్రాయం.
 

Hero Ravi Teja