పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
Ram Charan Peddi OTT Release Date
జూన్ 4 న పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదలైన రామ్ చరణ్ పెద్ది చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా హిట్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది పెద్ద హిట్టు. ఇతర భాషల్లో పెద్ది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రామ్ చరణ్ నటనను మెచ్చుకున్న ఆడియన్స్ మిగతా విషయాల్లో తీవ్ర విమర్శలు చేసారు.
రామ్ చరణ్ స్టామినాకు తగిన హిట్ కాదు పెద్ది అనేసారు. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో క్లోజింగ్ దశకు చేరుకుంది. దానితో పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ పై మెగా ఫ్యాన్స్ కన్ను పడింది. థియేటర్స్ లో పెద్ది విడుదలైన నెల పూర్తవుతున్న సందర్భంలో పెద్ది చిత్ర ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసింది.
జులై 16 నుంచి పెద్ది సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ లోకి వస్తుంది.. అంటే థియేటర్స్ లో విడుదలైన 45 రోజులకి పెద్ది ఓటీటీ లోకి వస్తుంది. కానీ హిందీలో మాత్రం పెద్ది థియేటర్స్ లో విడుదలైన 56 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ లోకి రాబోతున్నట్టుగా ప్రకటించారు.







































