ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prithviraj Sukumaran praises Rajamouli

వారణాసి - పృథ్వీ ఇచ్చిన క్రేజీ హైప్

Prithviraj Sukumaran praises RajamouliPrithviraj Sukumaran praises Rajamouli

 

దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పృథ్వీ రాజ్ విలన్ గా వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు విపరీతమైన క్రేజ్ ఉంది. వారణాసి షూటింగ్ ఎంత స్పీడుగా తెరకెక్కుతుందో అంతే స్పీడుగా ప్రమోషన్స్ ఉంటున్నాయి.

తాజాగా వారణాసిలో కుంభ పాత్రలో కనిపిస్తున్న పృథ్వీ రాజ్ సుకుమార్ హాలీవుడ్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి అలాగే రాజమౌళి పర్ఫెక్షన్ పై చేసిన కామెంట్స్ వారణాసి పై మరింతగా అంచనాలు పెంచాయి. ఉదయం నుంచి రాత్రి దాకా కేవలం ఒక షాట్ కోసం తొంభై దాకా టేకులు తీసుకుని అది ఇంకా సాటిస్ఫేక్షన్ ఇవ్వలేదు అని ఆ రోజుకి షూటింగ్ ప్యాకప్ చెప్పేసారు. దర్శకుడిగా, నటుడిగా రాజమౌళి గ్రేట్ అంటూ పొగిడేసారు.

నటుడిగా నేను, దర్శకుడిగా ఆయన పోటీగా అనిపించేది, నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా రాజమౌళిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. బడ్జెట్, స్కేల్ పరంగా ఎవరూ ఊహించనంత గొప్పగా వారణాసి ఉండబోతుంది అంటూ పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ వారణాసి పై విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. 
 

Varanasi update