NBK112-మామ సినిమాకి అల్లుడు క్లాప్

NBK112 film launched in style

 

నందమూరి నటసింహ బాలకృష్ణ-కొరటాల శివ కాంబోలో NBK112 ప్రాజెక్ట్ నేడు గురువారం జూన్ 25 న అమరావతి లో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. బాలయ్య పంచె కట్టులో ఈ ఓపెనింగ్ వేడుకలో సందడి చేసారు. బాలయ్య-కొరటాల NBK112 ప్రాజెక్ట్ కి మినిస్టర్ నారా లోకేష్ క్లాప్ కొట్టారు.

మామ సినిమాకి అల్లుడు క్లాప్ కొట్టారు. మరో మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ పూజా కార్యక్రమానికి అతిధులుగా  పాల్గొన్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్వని ఈ వేడుకలో హైలెట్ గా నిలిచారు. కొరటాల-బాలయ్య కాంబో NBK112 అఫీషియల్ గా పూజ కార్యక్రమాలతో మొదలైంది.

అయితే NBK112 రెగ్యులర్ షూటింగ్ కి కొంత సమయం పడుతుంది అని తెలుస్తుంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా NBK111 చేస్తున్నారు.

Balakrishna-Koratala Shiva project launched in a traditional manner