NBK 112 - బాలయ్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్
NBK112- Makers Reveal Rs. 150–200 Crore Budget
నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కలయికలో NBK 112 ప్రాజెక్ట్ ఈరోజు జూన్ 25 న అమరావతిలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. మంత్రి నారా లోకేష్ NBK 112 కి క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి బాలయ్య కెరీర్ లనే హైయ్యెస్ట్ బడ్జెట్ పెట్టబోతున్నట్టుగా నిర్మాత ప్రకటించారు.
బాలయ్య ఇమేజ్ కి తగినట్లుగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా NBK 112 ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా, అంతేకాకుండా పాన్ ఇండియా మార్కెట్ కి సరిపోయేలా రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లుగా నిర్మాత ప్రకటించారు. 2027 సమ్మర్ కానుకగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా ఓపెనింగ్ రోజే అనౌన్స్ చేసారు.
బాలయ్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా, క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొరటాల తో NBK 112 ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకొచ్చే ప్లాన్ లో దర్శకుడు ఉన్నారు.







































