ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha Maa Inti Bnagaram collections report

సమంతకు మా ఇంటి బంగారంతో అంత లాభమా?

Samantha Maa Inti Bnagaram collections report


సమంత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్నాయి అనగానే సోషల్ మీడియాలో గ్లామర్ లుక్స్ ను షేర్ చెయ్యడమే కాదు బిజినెస్ మైండ్ తో అలోచించి నిర్మాతగా టర్న్ అయ్యింది. తన సొంత బ్యానర్ లో చిన్న సినిమాలు తెరకెక్కించే ప్లాన్ లో భాగంగా శుభం చేసింది. అది వర్కౌట్ అయ్యింది. ఆతర్వాత మా ఇంటి బంగారం.

రీసెంట్ గా విడుదలైన మా ఇంటి బంగారం చిత్రం కేవలం మూడు రోజుల్లో రూ.43 కోట్ల గ్రాస్ లాక్కొచ్చింది. సమంత స్టార్ పవర్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ తీసుకురావడం మాములు విషయం కాదు. మా ఇంటి బంగారం చిత్రానికి రూ.35 కోట్ల వరకు బడ్జెట్ అవ్వగా ఆ మొత్తం నాన్ థియేట్రికల్, శాటిలైట్ హక్కులతోనే బడ్జెట్ రికవరీ అయినట్లుగా తెలుస్తుంది.

ఇప్పుడు థియేట్రికల్ హక్కులపై వచ్చే మొత్తం సమంత కు లాభాలు తెచ్చి పెడుతుంది అంటున్నారు. మా ఇంటి బంగారం చిత్రానికి సమంత నే ప్రొడ్యూసర్. సో ఈ లెక్కన సమంత కు మా ఇంటి బంగారం లో రూ.25 కోట్ల లాభాలు కళ్ళ చూసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Samantha Maa Inti Bnagaram