ఏరు దాటాక తెప్ప తగలేస్తున్న హీరోయిన్స్
Tamannaah on Bollywood vs South
టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో వరస అవకాశాలొచ్చినప్పుడు అది గ్లామర్ పాత్రా, లేదంటే చిన్న పాత్రా, లేదు అంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రా అనేది చూడకుండా అవకాశాలు రాగానే ఒప్పేసుకుని.. వరస సినిమాలు చేసేసి.. అవకాశాలు తగ్గాక పక్క భాషకు పోయి టాలీవుడ్ పై అలాగే సౌత్ ఇండస్ట్రీ, సౌత్ దర్శకులపై రాళ్లు వేయడం హీరోయిన్స్ కి అలవాటుగా మారింది.
గతంలో తాప్సి సౌత్ లో ఉన్నప్పుడు చప్పుడు చెయ్యకుండా ఉంది, హిందీ కి పోగానే టాలీవుడ్ డైరెక్టర్స్ నడుము, నాభి చూపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇవ్వరు అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆ కోవలో మిల్కి బ్యూటీ తమన్నా చేరింది.
పవన్ దగ్గర నుంచి అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా సౌత్ లో చాలా ఏళ్ళు నిలదొక్కుకుంది. ఇప్పుడు ఆమెకు సౌత్ అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం హిందీలో కెరీర్ నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్న తమన్నా తాజాగా సౌత్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది.
కమర్షియల్ మూవీస్ లో హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ డాల్స్ లా ట్రీట్ చూసే విధానం తనకు అస్సలు నచ్చలేదని, సౌత్ ఇండస్ట్రీలో హీరోలకు ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంటుందని, హీరోయిన్లను స్క్రీన్‌పై గౌరవప్రదంగా చూపించే విషయంలో అక్కడ కొంత లోటు కనిపిస్తోంది, బాలీవుడ్‌లో కేవలం యాక్టింగ్ మాత్రమే చేసే హీరోయిన్లు కొంతమంది ఉంటె గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యే వాళ్లు మరికొందరు ఉంటారు.
ఇండియన్ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పాటలు, డ్యాన్సులకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, అందుకోసమే హీరోయిన్లను గ్లామర్ గా చూపిస్తారు తప్ప కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదు, నేను అనుష్క లాంటి హీరోయిన్స్ గ్లామర్ ఇంకా పెరఫార్మెన్స్ రెండిటిలో బ్యాలన్స్ గా ఉన్నాం కాబట్టే అన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండగలిగాం అంటూ తమన్నా చేసిన కామెంట్స్ చూసిన వారు ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.







































