యాక్షన్ డాక్టర్ ధర్మన్ గా సూపర్ స్టార్

  Thalaivar 173 gets a powerful titleThalaivar 173 gets a powerful title


సూపర్ స్టార్ రజినీకాంత్-లోకనాయకుడు కమల్ హాసన్ కాంబో ని అనౌన్స్ చేసి ఆ ప్రాజెక్ట్ పై భీభత్సమైన అంచనాలు క్రియేట్ చేసారు. ఈ చిత్రానికి సుందర్ సి డైరెక్టర్ అంటూ అనౌన్స్ చేసాక ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆతర్వాత సిబి చక్రవర్తి ఇలా పలువురు దర్శకులు ఈ క్రేజీ కాంబినేషన్ ని డైరెక్ట్ చేస్తున్నారన్నప్పటికీ ఫైనల్ గా డ్రాగన్ డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు.

ఈరోజు తలైవర్ 173వ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాదు మేకర్స్ అఫీషియల్‌గా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ధర్మన్ - ది డెడ్లీ డాక్టర్ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసారు. అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్షన్ డాక్టర్ ధర్మన్ గా కనిపిస్తారన్నమాట.

టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటే మేకర్స్ డాక్టర్ ధర్మన్ గా సూపర్ స్టార్ రజిని అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. రజిని లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. పక్కా యాక్షన్ వైబ్స్‌తో ఉన్న ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. 

Thalaivar 173 is titled as Dharman: The Deadly Doctor