ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Trisha B-Day wishes to CM Vijay go viral

విజయ్ తో ఒక్క పిక్ - అన్నిటికి త్రిష చెక్

Trisha B-Day wishes to CM Vijay go viralTrisha B-Day wishes to CM Vijay go viral


నిన్న జనవరి 22 సోమవారం తమిళనాడు సీఎం విజయ్ బర్త్  డే. ఆయనకు సినీ,రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు. విజయ్ కి ఎంతమంది విశేష్ చెప్పినా అందరూ త్రిష విజయ్ ని విష్ చేసే క్షణం కోసం ఎదురు చూసారు. ఎందుకంటే విజయ్-త్రిష రిలేషన్ లో ఉన్నారు, అందుకే విజయ్ ఆయన భార్య సంగీత విడిపోతున్నారనే ప్రచారం ఉంది.

ఆ ప్రచారాన్ని విజయ్, త్రిష ఎప్పటికప్పుడు నిజం చేస్తున్నారు. కానీ నిన్న విజయ్ పుట్టిన రోజుకి త్రిష సైలెంట్ గా ఉండడం చూసి విజయ్ కు, త్రిష కు బ్రేకప్ అయ్యింది, విజయ్ ని ఇన్స్టా లో త్రిష అన్ ఫాలో చేసింది అంటూ ఈరోజున పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమన్నాయి. అయితే త్రిష-విజయ్ లు పబ్లిసిటీ ఎందుకులే అని సీక్రెట్ గా కేక్ కట్ చేసుకున్నారు. కానీ మరో రకంగా వారిపై రూమర్స్ పుట్టుకొచ్చాయి.

అందుకే త్రిష సోషల్ మీడియాలో ఈ రూమర్స్ కి ఒకే ఒక్క పిక్ తో చెక్ పెట్టింది. విజయ్ కి ఎదురుగా కేక్స్, వాటిని కట్ చేసేందుకు విజయ్ రెడీ అవ్వగా ఆయన పక్కనే త్రిష ఉన్న పిక్ షేర్ చేసింది. అంతేకాదు వీటన్నింటి విలువ పెంచే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విజయ్ ను విష్ చేస్తూ త్రిష ఆ ఫోటో ని షేర్ చేసింది.

మరి త్రిష నిజంగానే విజయ్ తో నిన్న కేక్ కట్ చేయిచిందా, లేదంటే పాత ఫొటో షేర్ చేసిందా అంటూ విజయ్ అభిమానులు, త్రిష ఫ్యాన్స్ అనుమాన పడుతున్నారు. మరి ఏది ఏమైనా విజయ్ తో పిక్ షేర్ చేస్తూ త్రిష అన్నిటికి సమాధానం చెప్పేసింది.

Trisha wishes CM Vijay on B-Day uniquely